ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కట్టడికి పటిష్ట చర్యలు

ABN, First Publish Date - 2021-04-20T04:33:30+05:30

కొవిడ్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ మేరకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అధికారులను సన్నద్ధం చేశారు. జిల్లా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. నోడల్‌ అధికారులుగా నియమించారు. కొవిడ్‌ పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా కార్యచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




జిల్లా అధికారులకు కీలక బాధ్యతలు

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్న కలెక్టర్‌ 

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 19: కొవిడ్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది.  ఈ మేరకు కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అధికారులను సన్నద్ధం చేశారు. జిల్లా అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. నోడల్‌ అధికారులుగా నియమించారు. కొవిడ్‌ పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా కార్యచరణ ప్రణాళికలు తయారు చేసుకోవాలని నోడల్‌ అధికారులను ఆదేశించారు.   కొవిడ్‌ పరీక్షల బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ జగన్నాఽథరావు, లాబ్స్‌ నిర్వహణ, తనిఖీలు సబ్‌కలెక్టర్‌ విదేఖర్‌, కొవిడ్‌ ఆసుపత్రులు నిర్వహణను జేసీ (ఆసరా) వెంకటరావు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఇన్‌చార్జిగా సాలూరు మెడికల్‌ ఆఫీసర్‌ రామేశ్వరిని నోడల్‌ అధికారులుగా నియమించారు. కంటైన్మెంట్‌ నిర్వహణను అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ, హోం క్వారైంటన్‌ ఇన్‌చార్జిగా  ఐసీడీఎస్‌ పీడీకి, శిక్షణలను మెడికల్‌ అధికారి డాక్టరు మేఘన, హోం ఐసోలేషన్‌ను మోపాడ మెడికల్‌ అఫీసర్‌ తిరుపతిస్వామిని నోడల్‌ అధికారులుగా నియమించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లకు ఇన్‌చార్జిగా జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, హెల్ప్‌డెస్క్‌ నిర్వహణను ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ అధికారి ఎస్‌వీ లక్ష్మణమూర్తి, ఆక్షిజన్‌ నిర్వహణ కోసం ఈఈ సత్యప్రభాకర్‌, మందులు నిర్వహణ బాధ్యతలను  డ్రగ్‌ కంట్రోల్‌ ఆసిస్టెంట్‌ డైరెక్టర్‌ రమాదేవి, మెడికల్‌ ఎసేన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను ఉప కలెక్టర్‌ జయరాం, 104 వాహనాల నిర్వహణను డీపీవో సునీల్‌రాజ్‌కుమార్‌, 108 వాహనాలు నిర్వహణను కోఆర్టినేటర్‌ నజీర్‌ను నియమించారు. మృతదేహాల అంత్యక్రియల బాధ్యతలను ఆర్‌డివో భవానీ శంకర్‌, మాన్‌ పవర్‌ నిర్వహణ డీఆర్‌వో గణపతిరావు, ఆర్ధిక పరమైన ఆంశాలు నిర్వహణకు ఖజానా శాఖ డీడీ ప్రసాద్‌ను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ నియమించారు. 



Updated Date - 2021-04-20T04:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising