ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా రథయాత్ర

ABN, First Publish Date - 2021-02-27T04:49:51+05:30

లుగో రోజు శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, యువకులు హాజరయ్యారు. స్వామివారి రథాన్ని లాగారు. జై శ్రీరామ్‌ నినాదాలతో గ్రామం మార్మోగింది. రాత్రి 10 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. రామతీర్థంతో పాటు సీతారామునిపేట,

రామతీర్థంలో స్వామివారి రథయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




రామనామస్మరణతో మార్మోగిన రామతీర్థం

అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

నెల్లిమర్ల, ఫిబ్రవరి 26: రామతీర్థం దేవస్థానంలో సీతారాముల రథయాత్ర శుక్రవారం రాత్రి వేడుకగా సాగింది. భీష్మ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా నాలుగో రోజు శుక్రవారం స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు, యువకులు హాజరయ్యారు. స్వామివారి రథాన్ని లాగారు. జై శ్రీరామ్‌ నినాదాలతో గ్రామం మార్మోగింది. రాత్రి  10 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. రెండు గంటల పాటు సాగింది. రామతీర్థంతో పాటు సీతారామునిపేట, గొర్లెపేట, కొత్తపేట, తంగుడుబిల్లి, దన్నానపేట, సతివాడ, సారిపల్లి , టి.అగ్రహారం గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ టి.సత్యమంగవేణి, ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, గొడవర్తినరిసంహాచార్యులు, పవన్‌ కుమార్‌, పాణంగిపల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈవో ప్రసాదరావు పర్యవేక్షించారు. 



Updated Date - 2021-02-27T04:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising