ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిబంధనలతో రంజాన్‌

ABN, First Publish Date - 2021-05-14T04:51:15+05:30

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పండగ జరుపుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మసీదులు, ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజులు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముస్లింలకు కలెక్టర్‌ శుభాకాంక్షలు 

కలెక్టరేట్‌, మే 13: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పండగ జరుపుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మసీదులు, ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజులు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పండుగ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు పరిమిత సంఖ్యలో  50మందికి మించకుండా ఈద్‌ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. ఇంటి వద్ద భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతోగాని, శానిటైజర్‌ గాని శుభ్రపరుచుకోవాలన్నారు. ఈద్గాలు, మసీదుల పరిసరాల్లో ఉమ్మి వేయరాదని, ముస్లింలు ఆచరించే కరచాలనాలు, ఆలింగనాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మసీదుల ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. 


Updated Date - 2021-05-14T04:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising