ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ

ABN, First Publish Date - 2021-04-16T04:38:56+05:30

అప్రమత్తత, అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను నివారించొచ్చని జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి వి.సోమేశ్వరరావు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీతో పాటు వాటర్‌ విన్యాసాలు చేపట్టారు.

విజయనగరంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న అగ్నిమాపక శాఖాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్‌ 15: అప్రమత్తత, అవగాహనతోనే అగ్ని ప్రమాదాలను నివారించొచ్చని జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి వి.సోమేశ్వరరావు తెలిపారు.  అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీతో పాటు వాటర్‌ విన్యాసాలు చేపట్టారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున  ఇళ్లు, గోదాముల పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఏ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినా 101కి సమాచారం అందించాలని సూచించారు.  కార్యక్రమంలో అగ్నిమాపక శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  గజపతినగరం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో అగ్ని ప్రమా దాలపై అవగాహన కల్పించారు. విద్యుత్‌, గ్యాస్‌ వాడకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక కేంద్రాధికారి కె.అప్పారావు తెలిపారు. పార్వతీపురం: పట్టణంలో పాతబస్టాండ్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో అగ్నిప్రమాదాల నివారణపై  అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా  అగ్నిమాపక శాఖాధికారి బి.సోమేశ్వరరావు మాట్లాడుతూ గృహాల్లో మహిళలు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు అగ్ని ప్రమాదాలకు సంబంధించి అవ గాహన కలిగి ఉండాలన్నారు. వంట గదుల్లో, రెస్టారెంట్లలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు.    సాలూరు: అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని   అగ్నిమాపక శాఖాధికారి పి.పైడిరాజు కోరారు. పట్టణంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద మంటలను ఆర్పే  విధానాలను తెలియజేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ఆయన వివరించారు.  అగ్నిప్రమాదాలు సంభవించేటప్పుడు  అగ్నిమాపక కేంద్రం 08964242489 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. సిబ్బంది నాగరాజు, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.   చీపురుపల్లి: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆ శాఖ అధికారులు   ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మూడు రోడ్ల కూడలిలో  అగ్నిమాపక శాఖాధికారి డి. హేమసుందరరావు నేతృత్వంలో సిబ్బంది ప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రజలకు కర పత్రాలు పంపిణీ చేశారు. 

 

Updated Date - 2021-04-16T04:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising