ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’ ప్రతిపాదనలు సిద్ధం చేయండి

ABN, First Publish Date - 2021-10-19T04:35:22+05:30

ఉపాధి హామీ పథకంతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ నెల 22లోగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉపాధి హామీ పథకంపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులను గుర్తించాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించి ప్రజోపయోగ పనులకు పెద్దపీట వేయాలన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



‘ఉపాధి’ ప్రతిపాదనలు సిద్ధం చేయండి

కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, అక్టోబరు 18: ఉపాధి హామీ పథకంతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ నెల 22లోగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉపాధి హామీ పథకంపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులను గుర్తించాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించి ప్రజోపయోగ పనులకు పెద్దపీట వేయాలన్నారు. రూ.500 కోట్లతో పనులు చేపటనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 11 వేల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఇంకా ముఖ్యమైన శాఖల ద్వారా ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నారు. హౌసింగ్‌, పంచాయితీ రాజ్‌, డీపీవో, మత్య్సశాఖ, ఆర్‌డబ్య్లూఎస్‌, విద్యాశాఖ, పశుసంవర్ధక, అటవీ తదితర శాఖల నుంచి ప్రతిపాదనలు రావాలన్నారు. చెక్‌డ్యామ్‌లు, శ్మశానవాటికల నిర్మాణాలతో పాటు ప్రహరీలు, రహదారులు, ఇంకుడుగుంతలు, నర్సరీలు, పశువుల షెడ్లు, వ్యవసాయ బావులు వంటి వాటికి ప్రతిపాదనల్లో చోటు కల్పించాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ‘వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌’కు అవకాశం కల్పించిందన్నారు.  ప్రతి సచివాలయాన్ని వారానికి మూడుసార్లు తనిఖీ చేయాలని జేసీ మహేష్‌ కుమార్‌ ఆదేశించారు జేసీలు కిషోర్‌కుమార్‌, మయూర్‌ఆశోక్‌, జల్లేపల్లి వెంకటరావు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-10-19T04:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising