ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడోదశపై పోరుకు సిద్ధం

ABN, First Publish Date - 2021-07-09T05:13:55+05:30

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను సమన్వయంతో ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను అనుసరించి ఏ మేరకు వసతులు ఉన్నాయి? ఎన్ని పడకలు సిద్ధంగా ఉన్నాయి? అనేదానిపై ఆరా తీశారు.

మాట్లాడుతున్న జేసీ మహేష్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ముందుకు రావాలి 

జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ 

కలెక్టరేట్‌, జూలై 8: కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను సమన్వయంతో ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలను అనుసరించి ఏ మేరకు వసతులు ఉన్నాయి? ఎన్ని పడకలు సిద్ధంగా ఉన్నాయి? అనేదానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు కేవలం కొవిడ్‌ మినహా తరువాత పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. అవి ఆసుపత్రులకు భారమవుతాయని చెప్పారు. జేసీ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ రెండు, మూడు ఆసుపత్రులు క్లస్టర్లుగా ఏర్పడితే బాగుంటుందని సూచించారు.  మొదటి, రెండో దశలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో గుర్తించిన మూడు పిడియాట్రిక్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మూడో దశను ఎదుర్కోవాలని, ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో జేసీ వెంకటరావు, జిల్లా వైద్యాధికారి రమణకుమారి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-09T05:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising