ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడులో నాణ్యత పాటించండి

ABN, First Publish Date - 2021-03-03T06:04:19+05:30

నాడు-నేడు పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో కాంట్రాక్టరుతోపాటు, అధికారులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌
పూసపాటిరేగ, మార్చి 2:
నాడు-నేడు పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో కాంట్రాక్టరుతోపాటు, అధికారులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కుమిలి జిల్లా పరిషత్‌ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. తొలుత పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని మరుగుదొడ్లకు సరైన వెంటిలేషన్‌ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడలకు వేసిన పెయింటింగ్‌ పెచ్చులు కొన్ని చోట్ల ఊడిపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పనులను సక్రమంగా నిర్వహించిన తర్వాతే కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడునేడు పనులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, వాటిని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారి వెట్రి సెల్వి పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. తమకు సైకిళ్లు అందజేయాలని విద్యార్థినులు కోరారు. జేసీ మహేష్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T06:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising