ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులతో రాజకీయమా?

ABN, First Publish Date - 2021-05-18T05:25:31+05:30

జిల్లాలో ఓ వైపు ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురవుతుంటే... మరోవైపు అధికార పార్టీ నేతలు రైతుల జీవితాలతో చెలగాడం ఆడుకుంటున్నారని విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొక్కజొన్న పంట కొనాలంటే వైసీపీ నేతల సిఫార్సు కావాలా?

విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున

విజయనగరం (ఆంధ్రజ్యోతి), మే 17 : జిల్లాలో ఓ వైపు ప్రజలు కరోనాతో భయబ్రాంతులకు గురవుతుంటే... మరోవైపు అధికార పార్టీ నేతలు రైతుల జీవితాలతో చెలగాడం ఆడుకుంటున్నారని విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కొనేవారు లేక ఏడాదిగా మొక్కజొన్న రైతులు ఇబ్బంది పడుతుంటే... ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 30 శాతం మాత్రమే మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం దా రుణమన్నారు. అదీ కూడా అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉన్నవారి నుంచే అధికారులు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ పంటకు డిమాండ్‌ లేదనుకుంటే వ్యవసాయ శాఖ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నది ఎందుకన్నారు. ఈ పంటకు డిమాండ్‌ లేదని ముందే చెబితే వేరే పంటను రైతులు సాగుచేసుకువారన్నారు. అప్పులు చేసి, కష్టించి పండించిన పంటను ఇప్పుడు ప్రభుత్వం కొనమంటే రైతులకు జరిగిన ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైన జిల్లాకు చెందిన మంత్రులు, ఉన్నాతాధికారులు రైతుల సమస్యలను పరిగిణలోకి తేసుకుని, వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-18T05:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising