డిసెంబరు లోగా ఓటీఎస్ పూర్తి : జేసీ
ABN, First Publish Date - 2021-10-30T04:58:34+05:30
హౌసింగ్ శాఖలో చేపట్టిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్ మెంట్) ప్రక్రియ డిసెంబరు 21లోగా పూర్తికానున్నట్టు జేసీ వెంక టరావు తెలిపారు. శుక్రవారం చీపురుపల్లిలోని 1, 2 సచివాలయాలను సందర్శిం చారు.
చీపురుపల్లి: హౌసింగ్ శాఖలో చేపట్టిన ఓటీఎస్ (వన్ టైం సెటిల్ మెంట్) ప్రక్రియ డిసెంబరు 21లోగా పూర్తికానున్నట్టు జేసీ వెంక టరావు తెలిపారు. శుక్రవారం చీపురుపల్లిలోని 1, 2 సచివాలయాలను సందర్శిం చారు. రెండో నంబరు సచివాలయంలోని హాజరు పట్టీలో వలంటీర్ల సంత కాలు లేకపోవడంపై వారిని మందలించారు. సంతకం చేయకుంటే వేతనాలు నిలిపివేస్తామన్నారు. వెల్ఫేర్ కేలండర్‌ను నోటీస్ బోర్డులో ఉంచక పోవడంపై వెల్ఫేర్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రావివలస, మెట్టపల్లిలో ఓటీఎస్ సర్వేను ఎంపీడీవో, తహసీల్దార్ పరిశీలించారు.
Updated Date - 2021-10-30T04:58:34+05:30 IST