ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌ గేటు వద్దే రాత్రినిద్ర

ABN, First Publish Date - 2021-07-23T05:23:15+05:30

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను తెరిపించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. గేటుకు ఎదురుగా బైఠాయించి ఖాళీ కంచాలతో రాత్రి వరకూ నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ వద్ద నిద్రిస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన 

వసతి గృహాలు తెరిపించాలని డిమాండ్‌

కలెక్టరేట్‌, జూలై 22: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను తెరిపించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. గేటుకు ఎదురుగా బైఠాయించి ఖాళీ కంచాలతో రాత్రి వరకూ నిరసన తెలిపారు. అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు వి.చినబాబు మాట్లాడు తూ  కళాశాలలు తెరవడానికి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం వసతిగృహాలపై స్పష్టత ఇవ్వలేదన్నారు. దీంతో దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని మూడు కళాశాలలు ప్రారంభించారని, నేటికీ బస్సు సదుపాయం లేదన్నారు. మరోవైపు వచ్చే నెల రెండో తేదీన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఇక్కడే రాత్రినిద్ర కూడా చేశారు. నిరసనలో విద్యార్థి సంఘ నాయకులు ఎం.హర్ష, హరీష్‌, రవి, లక్ష్మణ, టి.నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-23T05:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising