ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతన్నకేదీ ఆపన్నహస్తం

ABN, First Publish Date - 2021-05-14T04:52:44+05:30

జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కొవిడ్‌ కాలంలో పనిలేక విలవిల్లాడుతున్నారు. సహకార సంఘాలు ఉన్నా మొక్కుబడి చందమే. పని కల్పించే పరిస్థితిలో అవి లేవు. చాలా సంఘాలు మూతపడుతున్నాయి. వాటికి అందాల్సిన బిల్లులు లక్షల్లో ఉన్నాయి.

గంగన్నపాడులో మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంతమందికే ‘నేతన్న నేస్తం’

మూతపడుతున్న సహకార సంఘాలు

ఆదుకోని ప్రభుత్వం 

తెర్లాం, మే13: జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కొవిడ్‌ కాలంలో పనిలేక విలవిల్లాడుతున్నారు. సహకార సంఘాలు ఉన్నా మొక్కుబడి చందమే. పని కల్పించే పరిస్థితిలో అవి లేవు. చాలా సంఘాలు మూతపడుతున్నాయి. వాటికి అందాల్సిన బిల్లులు లక్షల్లో ఉన్నాయి. ఆప్కో నుంచి సరైన సహకారం లేదు. ప్రభుత్వం ప్రకటించిన నేతన్న నేస్తం పథకం కూడా అర్హులందరికీ అందడం లేదు. జిల్లాలో వేలల్లోనే చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం 18 సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇందులో బాగా పనిచేస్తున్నవి స్పల్పమే. అవి ఏడాదిలో ఒకసారి నేతన్న నేస్తం కింద అందజేసే రూ.24 వేలను ఇవ్వడానికే పరిమితమయ్యాయి. జిల్లాలో 505 కుటుంబాలకే నేతన్న నేస్తం అందుతోంది. మిగిలిన కుటుంబాలకు అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలు చూపుతూ వారిని విస్మరించారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తుల(మాస్టర్‌ వీవర్స్‌)కు చీరలు నేయడాన్ని కొన్నిచోట్ల నేతన్న నేస్తానికి అనర్హులుగా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెర్లాం మండలం గంగన్నపాడులో సుమారు 40 కుటుంబాలు నేత పనిని నమ్ముకొని జీవిస్తున్నాయి. వీళ్లకు ప్రభుత్వం తరపున పథకాలు నామమాత్రంగా అందుతున్నాయి. సహకార సంఘం ఉపాధి చూపకపోవడంతో ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్నారు. వీళ్లకు చీరల అల్లికలో మంచి పేరుంది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన సబ్సిడీ అందడం లేదని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రైవేటు వ్యక్తులను నమ్ముకున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రింట్‌ వస్త్రాల దాటికి తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. 

ముద్రా రుణం మంజూరు చేస్తాం

జిల్లాలో అర్హులందరికీ నేతన్న నేస్తం ఇచ్చాం. 2019 ఆగస్టున, 2020 జూన్‌లో రూ.24వేల చొప్పున అందజేశాం. మిగిలిన కుటుంబాల్లో 381 మందికి ముద్రా రుణం అందించాం. లాక్‌డౌన్‌ సమయాల్లో చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి రూ.10వేల సబ్సిడీతో ముద్రా లోన్లు మంజూరు చేస్తాం. అర్హులందరికీ నేతన్న నేస్తం అందేలా చర్యలు తీసుకుంటాం. 

- పెద్దిరాజు, ఏడీ, జౌళీశాఖ



Updated Date - 2021-05-14T04:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising