ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

ABN, First Publish Date - 2021-08-26T05:18:51+05:30

జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణకు పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు సంయుక్తంగాచర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా 959 పంచాయతీ పరిధిలోని పల్లెల్లో రక్షిత పథకం ట్యాంకు లను శుభ్రం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణకు పంచాయతీ రాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు సంయుక్తంగాచర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా 959 పంచాయతీ పరిధిలోని  పల్లెల్లో  రక్షిత పథకం ట్యాంకు లను శుభ్రం చేస్తున్నారు.  ప్రతి శుక్రవారం శుద్ధి కార్యక్రమం చేపట్టాలని  సచివాల యాల్లోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, సిబ్బందికి  ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల నుంచి 4లక్షల లీటర్లు  సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంకులు 2,032 ఉన్నాయి. వాటితో పాటు సోలార్‌తో నీటిని నింపే 5వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులు 165 ఉన్నాయి. ప్రతి 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంకుకు క్లోరిన్‌ లిక్విడ్‌  50 గ్రాములు వినియోగించాలని  ఉన్న తాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఇదిలా ఉండగా గ్రామాల్లోనే నీటి పరీక్షలు నిర్వహించేలా ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు శుద్ధి పరికరాలు అందచేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ  శివానంద్‌ తెలిపారు. రోజూ నీటిని పరీక్షించి  ఫలితాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు.  పల్లెల్లో  సీజనల్‌ వ్యాధులతో పాటు, కరోనా  ప్రబలకుండా పారిశుధ్య మెరుగు చర్యలతో పాటు తాగునీటి శుద్ధి కార్యక్ర మాలు చేపడుతున్నామని డీపీవో సుభాషిణి తెలిపారు. ఇందుకు సంబంధించి  15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని సచివాలయ సిబ్బంది, పంచా యతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

 

Updated Date - 2021-08-26T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising