ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవదాయ భూముల సంరక్షణకు చర్యలు

ABN, First Publish Date - 2021-06-14T04:12:46+05:30

దేవదాయ భూముల సంరక్షణకు చర్యలు

శివ్వాంలోని భూములు పరిశీలిస్తున్న సహాయ కమిషనర్‌ కిషోర్‌కుమార్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహాయ కమిషనర్‌ ఈవో కిశోర్‌కుమార్‌

గరుగుబిల్లి : దేవదాయ భూము ల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతు న్నట్టు ఆ శాఖ సహాయ కమిషనర్‌, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం  శివ్వాంలో గల ఆలయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం, సీతంపేటలోని  జగన్నాథస్వామి ఆలయానికి సంబంధించిన భూములు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం లీజు కాలం ముగియడంతో రైతులతో సమావేశం నిర్వహిం చారు. ఆలయానికి సంబంధించి సర్వే నెంబరు 1248లో 7.70 ఎకరాలు,  41, 42 సర్వే నెంబర్లలో 2.92 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను మరో మూడేళ్లు లీజుకు ఇచ్చేందుకు  చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 28న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కౌలుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల రైతులు హాజరుకావాలని సూచించారు. దేవదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు ఆక్రమణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  సీనియర్‌ సహాయకులు డి.రామారావు, రమణ, ఎం.మురళీనాయుడు, పోలిరాజు తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-06-14T04:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising