ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందాం

ABN, First Publish Date - 2021-03-01T04:53:38+05:30

ఐక్య పోరాటాలతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి (రామభద్రపురం), ఫిబ్రవరి 28: ఐక్య పోరాటాలతో విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి తెలిపారు. వేణుగోపాలస్వామి ఆలయ మండపంలో ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... లాభనష్టాలతో  ప్రమేయం లేకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడమే  కేంద్ర సర్కార్‌ లక్ష్యంగా  పెట్టుకుందని ఆరోపించారు.  ఉక్కు పరిశ్రమకు సొంత  గనులు లేకపోవడం వల్లే నష్టాల్లో నడుస్తోందని ఆయన తెలిపారు. ప్రైవేటు పరిశ్రమకు అప్పులుంటే రుణాలు మాఫీ చేస్తున్న కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు.  విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటా యించకపోవడం అన్యాయమన్నారు. బడా పెట్టుబడిదారుల సేవల్లో  మోదీ  తరి స్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీని విధానాలను ప్రశ్నిస్తే దేశద్రోహం కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌తో వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందతున్నారని, ఇటువంటి పరిశ్రమను ప్రైవేటీ కరించడం అన్యాయమని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలంతా ఐకమత్యంతో దీనిని కాపాడుకోవాలన్నారు. ఏఐఎఫ్‌టీయూ నాయకుడు శంకరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.   ఉక్కు పరిశ్రమ వేదిక కో కన్వీనర్‌ విజయగౌరి మాట్లాడుతూ.. అత్యాధునిక యం త్రాలతో నడుస్తున్న ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం కేంద్రప్రభుత్వానికి తగదన్నారు. ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకుడు ఎం.గోపాలం మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసులకు ఆధారమైన  ఉక్కు పరిశ్రమను ప్రధాని మోడీ ప్రైవేటీకరిస్తామని ప్రకటించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.  ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న  స్టీల్‌ప్లాంట్‌ను  పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు.  ఉక్కు పరిరక్ష వేదిక నాయకులు వొమ్మి రమణ, రౌతు రామ్మూర్తి నాయుడు, మువ్వల శ్రీనివాస రావు, కె.సత్యనారాయణ, సీహెచ్‌ మహందాత నాయుడు, అప్పలస్వామి, రెడ్డి వేణు, ఇందిర, ఎం.శ్రీనివాస్‌, అప్పలనాయుడు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T04:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising