ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థర్డ్‌వేవ్‌ను కలిసికట్టుగా నివారిద్దాం!

ABN, First Publish Date - 2021-07-24T05:04:32+05:30

జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను కలిసికట్టుగా నివారిద్దామని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ సునీల్‌రాజ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం (ఆంధ్రజ్యోతి)జూలై 23 : జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను  కలిసికట్టుగా నివారిద్దామని డీఆర్‌డీఏ పీడీ కె.సునీల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.  శుక్రవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  మూడో ముప్పును  ఎదుర్కోవడానికి డీఆర్‌డీఏ, వెలుగు శాఖ ఆధ్వర్యంలో   అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.  ఇప్పటికే మండలాల్లోని క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రచారం చేస్తున్నామన్నారు.  డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం నుంచి డాక్టర్లు, నర్సులు, ఆశావర్కర్లు తదితర సిబ్బంది సేవలను, ప్రచారానికి వినియోగిస్తామని వెల్లడించారు.  మూడో ముప్పును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సమాయత్తంగా ఉందన్నారు.  జిల్లా వ్యాప్తంగా  47,441 మహిళా సంఘాలు ఉండగా, అందులోని 5లక్షల 40 వేల 245 మంది సభ్యులతో  పల్లెల్లో అవగాహన కల్పించ నున్నారని స్పష్టం చేశారు.  దీనిపై ఇప్పటికే వెలుగు క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు పంపించామన్నారు. ఏపీడీ సావిత్రి, డీపీఎంఎస్‌, ఎపీఎంఎస్‌ మండల సమాఖ్య అధ్యక్షులు, డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి డాక్టర్‌ మేఘన పాల్గొన్నారు. 


 

 

Updated Date - 2021-07-24T05:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising