ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోసింగిభద్ర హెచ్‌ఎంను సస్పెండ్‌ చేశాం

ABN, First Publish Date - 2021-09-19T05:42:02+05:30

కోసింగిభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బిడ్డిక చిన్నారావు మృతికి బాధ్యులైన పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న బిడ్డిక సొంబరను సస్పెండ్‌ చేసినట్టు పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాధ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

గుమ్మలక్ష్మీపురం: కోసింగిభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బిడ్డిక చిన్నారావు మృతికి బాధ్యులైన పాఠశాల హెచ్‌ఎం, వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న బిడ్డిక సొంబరను సస్పెండ్‌ చేసినట్టు పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాధ్‌ తెలిపారు. శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. హెచ్‌ఎంను సస్పెండ్‌ చేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న మరొక ఉపాధ్యాయుడిని వేరే చోటకు బదిలీ చేసినట్టు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట చెరువు వద్దకు వెళ్లి స్నానం చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉన్న సిబ్బంది విద్యార్థుల పట్ల బాధ్యతతో పనిచేయాలని సూచించారు. నాడు-నేడు నిధులను సక్రమంగా వినియోగించి, పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. 

Updated Date - 2021-09-19T05:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising