ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూట్‌ కార్మికుల సమస్య కొలిక్కి!

ABN, First Publish Date - 2021-02-25T04:57:48+05:30

పట్టణంలో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు కార్మికుల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో మిల్లు యాజ మాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి (రామభద్రపురం), ఫిబ్రవరి 24: పట్టణంలో ఉన్న శ్రీలక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు కార్మికుల సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఆధ్వర్యంలో మిల్లు యాజ మాన్యం, కార్మికుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. బకాయి ఉన్న సొమ్మును విడతల వారీగా చెల్లించేందుకు యాజ మాన్యం అంగీకరించింది. గురువారం నుంచి చెక్కుల రూపంలో రోజుకు 15 మందికి ఈ బకాయిలు చెల్లించడానికి  రెండు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది. సుమారు రూ.5 కోట్ల బకాయిలను 428 మంది కార్మికులకు చెల్లించేందుకు చర్యలు చేపడతామని ఫైనాన్స్‌ మేనేజర్‌ ఎ.శ్రీనివాసరావు అంగీకరించారు. మార్చి నెలా ఖరులోగా ఈ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు.  సమావేశంలో వైసీపీ నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు,  రమేష్‌నాయుడు, గోపాలరావు, రాంసుధీర్‌,  కృష్ణమూర్తి, యూని యన్‌ నాయకులు కృష్ణారావు,  శేషగిరిరావు, రామారావు, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-02-25T04:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising