5న జేఎల్‌ఎం సామర్థ్య పరీక్షలు
ABN, First Publish Date - 2021-10-30T04:09:41+05:30
జిల్లాలో 74 గ్రేడ్-2 లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా నవంబరు 5న సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ ఎస్.మసీలామణి తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే జేఎన్‌టీయూ (కాకినాడ) ఆధ్వర్యంలో 3,608 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మూడు విభాగాల్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మసీలామణి
రింగురోడ్డు, అక్టోబరు 29: జిల్లాలో 74 గ్రేడ్-2 లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా నవంబరు 5న సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీఈపీడీసీఎల్ ఎస్.మసీలామణి తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే జేఎన్‌టీయూ (కాకినాడ) ఆధ్వర్యంలో 3,608 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. మూడు విభాగాల్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సైకిల్ తొక్కడం, స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ తీయడం వంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రాత, సామర్థ్య పరీక్షల్లో ప్రతిభచూపిన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి కాల్ లెటర్లు పంపించినట్టు తెలిపారు. అభ్యర్థులు 5వ తేదీ ఉదయం 9 గంటలకు కాల్‌లెటర్, ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. మధ్యవర్తులను నమ్మవద్దని ఎస్‌ఈ సూచించారు. సమావేశంలో ఈఈ కృష్ణమూర్తి, ఏడీఈలు, విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:09:41+05:30 IST