ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-04-17T05:21:26+05:30

ఏపీ మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఆర్‌.ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెర్లాం, ఏప్రిల్‌ 16:  ఏపీ  మోడల్‌ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఆర్‌.ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చేనెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. తరగతికి 80 సీట్లు మాత్రమే ఉంటాయని,  రిజర్వేషన్లకు అనుగుణంగా లాటరీ పద్ధతిలో  కేటాయిస్తామని వెల్లడించారు. దరఖాస్తుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.వంద, ఎస్సీ విద్యార్థులు రూ.50 రుసుము చెల్లించాలన్నారు. అయితే   గుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలని, ఓసీ, బీసీ విద్యార్థులు 2009 సెప్టెంబరు 1న నుంచి 2011 ఆగస్టు 3వ తేదీ మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు.  ఏపీఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.    మక్కువ :  ములక్కాయవలస ఆదర్శ పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ శ్యాంసుందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   వేపాడ :    బక్కునాయుడుపేట వద్ద గల ఆధర్శ పాఠశాలలో  ఆరో తరగతిలో చేరేందుకు  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు   ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఇతర వివరాలకు బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాల లేదా డీఈవో, ఎంఈవోను సంప్రదించొచ్చని సూచించారు.

 

Updated Date - 2021-04-17T05:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising