ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో ‘సంస్థాగత’ సందడి

ABN, First Publish Date - 2021-06-14T05:09:06+05:30

తెలుగుదేశం పార్టీలో సంస్థాగత సందడి కన్పిస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. సభ్యత్వ నమోదు పూర్తయినా స్థానిక ఎన్నికలు, కరోనా కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. గ్రామ, వార్డు, డివిజన్‌ కమిటీల ఏర్పాటు తంతు జిల్లాలో 80 శాతం పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెలాఖరుకు అనుబంధ సంఘాలు,  మండల, పట్టణ కమిటీల నియామకం

(విజయనగరం రూరల్‌) 

తెలుగుదేశం పార్టీలో సంస్థాగత సందడి కన్పిస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. సభ్యత్వ నమోదు పూర్తయినా స్థానిక ఎన్నికలు, కరోనా కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగలేదు. గ్రామ, వార్డు, డివిజన్‌ కమిటీల ఏర్పాటు తంతు జిల్లాలో 80 శాతం పూర్తయింది. ఇక 20 శాతం మిగిలి ఉంది. పార్లమెంటరీ స్థాయి కమిటీలు పూర్తికావడంతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు, డివిజన్‌ స్థాయిలో పెండింగ్‌లో వున్న 20 శాతం కమిటీల ఎంపిక ప్రక్రియ కూడా నెలఖరుకు పూర్తికానుంది. అదే విధంగా మండల, పట్టణ, నగర టీడీపీ కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి అన్ని కమిటీలు నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. టీడీపీకి పది అనుబంధ సంఘాలున్నాయి. ఒక్కో సంఘానికి పది మందితో కమిటీ వేయనున్నారు. ఇవి కూడా నెలఖరు నాటికి పూర్తికానున్నాయి. ఈ కమిటీలన్నీ 2024 సంవత్సరం వరకూ కొనసాగనున్నాయి. వీటి కూర్పు పూర్తయ్యాక అన్ని స్థాయిల్లో ఉన్న టీడీపీ శ్రేణులకు మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నవంబరు నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం. 

-----------


Updated Date - 2021-06-14T05:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising