ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూములు తీసుకుంటే ఎలా బతికేది?

ABN, First Publish Date - 2021-07-27T04:15:52+05:30

‘మా వద్ద ఉన్న భూములను లాక్కొంటే... మేము ఎలా బతికేది’ అంటూ గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.

ఆందోళన చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




కలెక్టరేట్‌ వద్ద రైతుల ఆందోళన

కలెక్టరేట్‌, జూలై 26: ‘మా వద్ద ఉన్న భూములను లాక్కొంటే... మేము ఎలా బతికేది’ అంటూ గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మాణానికి భూములు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. నిరసన కార్యక్రమానికి రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే విజయనగరం నుంచి బొడ్డవరం వరకూ రహదారి నిర్మాణానికి భూములిచ్చామని..ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌తో ఉన్న భూమిని తీసుకోవాలని ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. వరి , అరటి, చెరుకు, పెసర, మినుము వంటి పంటలు వేసి సాగుచేస్తున్నామని.. అటువంటి భూమిని వదులుకోలేమని చెప్పారు. తక్షణం ప్రభుత్వం స్పందించి భూ సర్వే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్పందన విభాగంలో అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బి.రాంబాబు, కరక శ్రీనివాసరావు, ఆదినారాయణమూర్తి,పల్లి వెంకటరావు, చప్ప చిన్న, గుల్లుపల్లి ఆదినారాయణ తదితరులు ఉన్నారు. 




Updated Date - 2021-07-27T04:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising