ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురజాడ.. భావితరాలకు అడుగుజాడ

ABN, First Publish Date - 2021-12-01T04:49:31+05:30

మహాకవి గురజాడ అప్పారావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, ఆయన అడుగుజాడలో ప్రతిఒక్కరూ నడవాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆకాంక్షించారు. తెలుగు భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో గురజాడ వర్థంతిని పురస్కరించుకుని నగరంలో మంగళవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు.

గురజాడ స్వగృహంలో విగ్ర హం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సూర్యకుమారి 

విజయనగరం రూరల్‌, నవంబరు 30: మహాకవి గురజాడ అప్పారావు జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని,  ఆయన అడుగుజాడలో ప్రతిఒక్కరూ నడవాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆకాంక్షించారు. తెలుగు భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో గురజాడ వర్థంతిని పురస్కరించుకుని నగరంలో మంగళవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. గురజాడ ఉపయోగించిన వస్తువులతో రచయితలు, సాహితీవేత్తలు, అభిమానులు, అధికారులు మహాకవి విగ్రహం వరకు ర్యాలీ చేశారు. తొలుత గురజాడ నివాసంలో ఆయన విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ర్యాలీ అనంతరం వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. గురజాడ విగ్రహానికి ఆనుకుని ఏర్పాటు చేసిన ఫౌంటేన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురజాడ తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పారన్నారు. ఆయన నడయాడిన జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, జేసీ వెంకటరావు, సాంస్కృతిక సమాఖ్య నిర్వహకులు, గురజాడ కుటుంబ సభ్యులు ప్రసాద్‌, ఇందిర, లలిత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-01T04:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising