ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటపల్లి నిర్వాసితుల సమస్యలపై దృష్టి

ABN, First Publish Date - 2021-10-12T05:17:43+05:30

తోటపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సూర్యకుమారి

పార్వతీపురం, అక్టోబరు 11: తోటపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. ‘స్పందన’కు వచ్చిన వినతులకు సత్వర పరిష్కార మార్గం చూపిస్తున్నట్టు చెప్పారు సోమవారం పార్వతీ పురంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కలెక్టరేట్‌ స్పందనకు ప్రధానంగా రేషన్‌కార్డులు, ఉపాధి కల్పన, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు తదితర వాటికి ఎక్కు వగా వినతులు అందాయని చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని తెలిపారు. తోటపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుం టున్నట్టు చెప్పారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి రూ.32 కోట్లు అవసరమ ని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె చెప్పారు. పార్వతీ పురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఐటీడీఏ పీవో కూర్మనాధ్‌, జేసీ మహేష్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ భావన తదితరులు పాల్గొన్నారు.


ఈకేవైసీని పూర్తిచేయండి 

ఈకేవైసీని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.  ఈసందర్భంగా విద్యుత్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌, పౌర సరఫరాలు, ఉద్యాన వన, పశు సంవర్థకశాఖ, మత్స్యశాఖలకు సంబంధించి సమీక్షించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు,ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, శంబంగి వెంకటచినప్పలనాయుడు, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షులు వాకాడ నాగేశ్వరరావు, జేసీ కిశోర్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ పాల్గొన్నారు. 


బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లను కొనసాగించాలి

 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకం కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు విజ్ఞప్తి చేశారు. సోమవారం  జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారికి వినతిపత్రం అందించారు. ఆయన వెంట బార్నాల సీతారాం, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్రమౌళి, దొగ్గ మోహన్‌, గుంట్రెడ్డి రవికుమార్‌, జాగాన రవిశంకర్‌, పాలకొండ రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-10-12T05:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising