ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలపై దృష్టి

ABN, First Publish Date - 2021-04-21T04:24:16+05:30

కరోనా ఉధృతమవుతున్న వేళ నిత్యావసరాల ధరలపై అధికారులు దృష్టి సారించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వ్యాపారులతో సమావేశమయ్యారు. ఎమ్మార్పీకే నిత్యావసరాలు, పండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎస్‌.కోటలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



జిల్లావ్యాప్తంగా వ్యాపారులతో సమావేశం

ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు 

అధికారుల హెచ్చరిక

(శృంగవరపుకోట)

కరోనా ఉధృతమవుతున్న వేళ నిత్యావసరాల ధరలపై అధికారులు దృష్టి సారించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వ్యాపారులతో సమావేశమయ్యారు. ఎమ్మార్పీకే నిత్యావసరాలు, పండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ధరలు పెరుగుతుండడం, కొందరు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ అన్ని మండలాల తహసీల్దారులకు ఆదేశాలు జారీచేశారు. ధరలను కట్టడి చేయాలని సూచించారు. అదే సమయంలో కరోనా నియంత్రణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో అన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు వ్యాపార వర్గాలతో సమావేశమయ్యారు. మాస్కుల ధరించి వచ్చిన వారికే సరుకులు విక్రయించాలని.. భౌతిక దూరం పాటించే విధంగా దుకాణాల వద్ద ఏర్పాట్లు చేయాలని, శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.


ధరల స్థిరీకరణ లేక

నిత్యావసరాలు, పండ్ల ధరల స్థిరీకరణ లేదు. ఒక్కోచోట ఒక్కో ధరకు అమ్ముతున్నారు. కిలో ద్రాక్ష ఒకచోట రూ.100కు విక్రయిస్తుంటే..మరోచోట రూ.80కే అమ్ముతున్నారు. రైతుబజార్లలో కూరగాయల ధరలు ఒకలా ఉంటే..మిగతా మార్కెట్లలో అధికంగా వసూలు చేస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారుల వద్ద చెప్పనక్కర్లేదు. ప్రతిరోజూ ధరల వివరాలు రాకపోవడంతో ముందు రోజు ధరనే ప్రామాణికంగా తీసుకొని విక్రయిస్తున్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్‌.కోటకు చెందిన ఓ దుకాణ యజమాని ఇదే విషయంపై తహసీల్దారు ఎం.సురేష్‌ వద్ద ప్రస్తావించారు. సమీక్షలు, సమావేశాలు సరిపోవని..నిత్యం తనిఖీలతోనే ధరల నియంత్రణ సాధ్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత పరిస్థితులు పునరావృతం కాకుండా యంత్రాంగం ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరముంది.



Updated Date - 2021-04-21T04:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising