ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ మత్స్యకార భరోసా

ABN, First Publish Date - 2021-04-20T04:34:52+05:30

అర్హులైన మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా అందించనున్నట్టు మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి తెలిపారు. కొండ్రాజుపాలెం, ముక్కాం, చేపలకంచేరు తదితర గ్రామాల్లో సోమవారం బోట్ల గణన ప్రారంభమైంది. పర్యవేక్షించిన డీడీ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికిగాను రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి

భోగాపురం, ఏప్రిల్‌ 19:  అర్హులైన మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా అందించనున్నట్టు మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి తెలిపారు. కొండ్రాజుపాలెం, ముక్కాం, చేపలకంచేరు తదితర గ్రామాల్లో సోమవారం బోట్ల గణన ప్రారంభమైంది. పర్యవేక్షించిన డీడీ మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికిగాను రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ పథకం వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. అందుకే బోట్లు గణనకు వచ్చే అధికారులు, సిబ్బందికి సరైన వివరాలు అందించాలన్నారు. ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరుతో పాటు గుర్తింపు పత్రాలు అందజేయాలన్నారు. 728 బోట్లకు సంబంధించి 2,998 మంది మత్స్యకారులను గుర్తించామన్నారు.  కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ కిరణ్‌కుమార్‌, మత్స్యశాఖ సహాయకులు షరీఫ్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-20T04:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising