ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరానికి పండగ శోభ

ABN, First Publish Date - 2021-10-19T05:24:41+05:30

పైడితల్లమ్మ పండగలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా అన్ని కూడళ్లు రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న పైడితల్లిని దర్శించుకుని పులకించిపోయారు.

పైడితల్లమ్మ గుడి, మూడు లాంతర్ల జంక్షన్‌ వద్ద భక్తుల రాకపోకలు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఘనంగా తొలేళ్ల ఉత్సవం 

 పైడితల్లి ఆలయానికి భక్తుల తాకిడి  

 అంతటా సందడే సందడి

(ఆంధ్రజ్యోతి బృందం)

పైడితల్లమ్మ పండగలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా అన్ని కూడళ్లు రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న పైడితల్లిని దర్శించుకుని పులకించిపోయారు. జైజై పైడిమాంబ అంటూ మహిళలు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించు కున్నారు. పులివేషాలు, సాముగరిడీలతో కళాకారులు సందడి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగంతో పాటు దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఇక రాత్రి వేళ విద్యుత్‌ కాంతుల్లో పైడిమాంబ ఆలయంతో పాటు కోట, గంటస్తంభం తదితర ప్రాంతాలు మెరిసిపోయాయి. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. 


 

Updated Date - 2021-10-19T05:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising