ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల సామగ్రి పరిశీలన

ABN, First Publish Date - 2021-02-07T05:09:26+05:30

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో భద్రపర్చిన ఎన్నికల సామగ్రిని పార్వతీపురం నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ శనివారం పరిశీలించారు.

బ్యాలెట్‌ బాక్సులు పరిశీలిస్తున్న డుమా పీడీ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో భద్రపర్చిన  ఎన్నికల   సామగ్రిని పార్వతీపురం నియోజకవర్గం ఎన్నికల ప్రత్యేకాధికారి, ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ శనివారం పరిశీలించారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రి అంతా ఉన్నది, లేనిది అధికారులను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో జి.శ్రీని వాసరావు, తహసీల్దార్‌ పి.చంద్రమౌళి, ఎస్‌ఐ బి.మురళీ తదితరులు పాల్గొన్నారు.

  గజపతినగరం: స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగే విధంగా అధికారుల చర్యలు చేపట్టాలని డ్వామా పీడీ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో ఎన్నికల సామగ్రిని  శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన  మాట్లాడుతూ మండలం పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పించే విధంగా అధికా రులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో కె.కిషోర్‌కుమార్‌, ఏపీవో జి.సుందరరావు, ఏవో పి.సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. 

  బొబ్బిలి (రామభద్రపురం):  ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డ్వామా పీడీ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక  ఎంపీడీవో కార్యాలయంలో  బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఎటువంటి అలసత్వం చూపకుండా సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ‘మండల పరిధిలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఏయే క్లస్టర్లు ఉన్నాయి’  అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో చంద్రమ్మ, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 

   సాలూరు రూరల్‌: స్థానిక ఎన్నికల కోసం  ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో శనివారం సామగ్రిని సిద్ధం చేశారు.  ఈ సామగ్రిని పంచాయతీల వారీగా విభజించారు. పోలింగ్‌ ముందు రోజు సిబ్బందికి అందించేందుకు వీటిని సిద్ధం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కె.కుమార్‌ వర్మ పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-02-07T05:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising