ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామతీర్థంలో ఈ-హుండీ

ABN, First Publish Date - 2021-05-08T05:00:49+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఈ-హుండీ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లిమర్ల, మే 7: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో  ఈ-హుండీ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని దేవాదాయ శాఖలో ఉన్న ప్రఽధాన ఆలయాలతో పాటు 6ఏ, 6బీ కేటగిరిలో ఉన్న ఆలయాల్లో ఈ-హుండీ విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆలయానికి నగదు విరాళం అందించాలనుకునే దాతలు దేవాదాయ శాఖ వెబ్‌సైట్‌ ్టఝట.్చఞ.జౌఠి.జీుఽ  ద్వారా ఆలయం పేరు ఎంచుకుని తద్వారా అందించవచ్చని తెలపారు. పుట్టిన రోజు, ఆరోగ్యం, వివాహ మహోత్సవం తదితర మొక్కుబడులు తీర్చుకునే దాతలకు ఈ విధానం సులభతరమైన విధానమని పేర్కొన్నారు. నమోదు ప్రక్రియ విధానంపై ఆలయ ఆవరణలో ఫ్లేక్సీ ఏర్పాటు చేసి భక్తులకు తెలియజేస్తామని ఈవో తెలిపారు. 

12 గంటల వరకే దర్శనాలు..

రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉన్న దృష్ట్యా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దేవస్థానంలోకి భక్తులను అనుమతిస్తున్నట్టు ఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. 

Updated Date - 2021-05-08T05:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising