ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర్థంగా వ్యాక్సినేషన్‌ : జేసీ

ABN, First Publish Date - 2021-05-13T04:56:39+05:30

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహించాలని జేసీ కిషోర్‌కుమార్‌ సూచించారు. బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌ పరిశీలిస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రామభద్రపురం, మే 12:  కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహించాలని జేసీ కిషోర్‌కుమార్‌ సూచించారు.  బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్‌లో  నిర్వహించిన వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యాక్సిన్‌ కొరత ఉన్న నేపథ్యంలో  రెండో డోస్‌ మాత్రమే వేయాలన్నారు.  అనంతరం వ్యాక్సినేషన్‌ రికార్డులను పరిశీలించారు. కరోనా పరీక్షలపై ఆరా తీశారు.  మండలంలో   యాక్టివ్‌ కేసులు ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఏ మేరకు వైద్య సేవలు అంది స్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాక్సిన్లు అందించాలని సూచించారు. బుధవారం 60 మందికి వ్యాక్సిన్లు వేశామని వైద్యాధికారి శిరీష  తెలిపారు.  కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ చిన్నికృష్ణ, హెల్త్‌ సూపర్‌వైజర్‌   వాసుదేవరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.   పార్వతీపురం రూరల్‌ :  పెదబొండపల్లి గ్రామ పాఠశాలలో బుధవారం నిర్వహించిన వ్యాక్సినేషన్‌ను ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా  వ్యాక్సినేషన్‌పై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌  సజావుగా జరుగుతుందన్నారు.  అర్హులకే వ్యాక్సిన్‌ వేస్తున్నామని  వివరించారు. ప్రజలు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా పీవో కోరారు.

  

Updated Date - 2021-05-13T04:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising