ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

57,545 మందికి విద్యా దీవెన

ABN, First Publish Date - 2021-07-30T05:04:31+05:30

విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 57,545 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.30.02 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. తాడేపల్లి నుంచి గురువారం ఆన్‌లైన్‌ పద్ధతిలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా నుంచి పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలను తెలిపారు.

హాజరైన ఉప ముఖ్యమంత్రి, ఎంఎల్‌ఏలు, అధికారులు ( ఇన్‌సెట్‌)లో మాట్లాడుతున్న సీఎం జగన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.30 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌ 

కలెక్టరేట్‌, జూలై 29: విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 57,545 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.30.02 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. తాడేపల్లి నుంచి గురువారం ఆన్‌లైన్‌ పద్ధతిలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా నుంచి పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో లబ్ధిపొందిన విద్యార్థుల వివరాలను తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు 5419 మంది, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 3708 మంది, బీసీ సంక్షేమ శాఖలో 44,220 మంది, ఈబీసీలు 3001 మంది, ముస్లిం మైనార్టీలు 227 మంది, కాపు విద్యార్థులు 929 మంది, క్రిష్టియన్‌లు 41 మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అనంతరం విద్యా దీవెనకు సంబందించిన చెక్కును లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అందజేశారు. కార్యక్రమంలో శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, జేసీ వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్‌రాజ్‌కుమార్‌, మైనార్టీ సంక్షేమాధికారి బి.అరుణకుమారి, కార్పొరేటర్‌ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-30T05:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising