ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడి చెత్త ఇక్కడికి వద్దు

ABN, First Publish Date - 2021-02-27T05:33:11+05:30

పార్వతీపురం పట్టణ డంపింగ్‌యార్డులోని చెత్తను మండలంలోని అర్తాం గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలకు తరలించే ప్రయ త్నాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం డంపింగ్‌ యార్డు లారీల అడ్డగింత

కొమరాడ, ఫిబ్రవరి 26: పార్వతీపురం పట్టణ డంపింగ్‌యార్డులోని చెత్తను మండలంలోని అర్తాం గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలకు తరలించే ప్రయ త్నాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు. శుక్రవారం డంపింగ్‌ యార్డులో చెత్తను లోడ్‌ చేసుకుని వచ్చిన లారీలను అర్తాం గ్రామ సమీపంలో అడ్డుకున్నారు. అక్కడి వ్యర్థా లను మా ప్రాంతంలో ఎలా పారబోస్తారని నిలదీశారు. చెత్తను  తరలించడం లేదని, డంపింగ్‌ యార్డులో ఎరువుగా తయారైంది మాత్రమే పొలంలో వేసేందుకు తరలిస్తున్నట్లు చెప్పినప్పటికీ ప్రజలు ఒప్పుకోలేదు. పొలంలో ఎరువుగా విని యోగించినా అక్కడ నుంచి వచ్చే దుర్వాసన భరించలేమని, దయ చేసి పొలంలో ఎరువుగా కూడా వాడకుండా చూడాలని ప్రజలు కోరారు. ప్రజలు అడ్డుకోవడంతో చెత్తను తరలించే ప్రయత్నాన్ని మున్సిపల్‌ అధికారులు విరమించుకున్నారు. దీనిపై పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌ కనకమహలక్ష్మిని వివరణ కోరగా డంపింగ్‌ యార్డును ఎక్కడకూ తరలించడం లేదని, అందులో ఉన్న ఎరువు(చెత్త)ను మా త్రం రైతుల ఉపయోగం కోసం అర్తాం తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే అక్కడ ప్రజలు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఈ ప్రక్రియ నిలిపివేసినట్లు ఆమె తెలిపారు.


Updated Date - 2021-02-27T05:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising