ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనం కన్నా దానం గొప్పది

ABN, First Publish Date - 2021-01-18T05:25:23+05:30

సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్న ఉద్దే శంతో శానాపతి అప్పారావు, లీల దంపతులు నిరుపేదలకు చీరలు పంపిణీ చేయ డం అభినందనీయమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాడ జనవరి 17:  సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్న ఉద్దే శంతో శానాపతి అప్పారావు, లీల దంపతులు నిరుపేదలకు చీరలు పంపిణీ  చేయ డం అభినందనీయమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మండలం లోని వీలుపర్తి గ్రామానికి చెందిన నేరెళ్ల పైడిమాంబ తీర్థమహోత్సవాన్ని పురస్క రించుకొని అప్పారావు దంపతులు సమకూర్చిన 1200 చీరలను పంచాయతీలోని నిరుపేద మహిళలకు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, కోళ్ల రాంప్రసాద్‌ చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీతో పాటు పార్టీ శ్రేణులు కూడా నిరుపేదలకు అండగా ఉంటారన్నారు. ఆదుకునే వారిని గౌరవించడం వీలుపర్తి పంచాయతీ ప్రజలకు తెలుసునన్నారు. ఈ కార్యక్రమంలో మండల నేతలు గోగాడ జగన్నాధంనాయుడు, పోతల వెంకటరమణ, గ్రామ పెద్దలు ఏడువాక జోగారావు, గోకేడ నాగభూషణం, కొప్పల అప్పారావు తది తరులు పాల్గొన్నారు. అనంతరం వేలాది మందికి అప్పారావు దంపతులు అన్న సంతర్పణ నిర్వహించారు. పెదదుంగాడ, చినదుంగాడ, కొలుకుపాలెం, బొర్రవలస, వీలుపర్తి, వెల్దాం, చామలాదేవి ఆగ్రహారం గ్రామాలకు చెందిన వేలాది మంది పాల్గొని భోజనాలు చేశారు.

Updated Date - 2021-01-18T05:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising