ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల సురక్ష అమలయ్యేనా?

ABN, First Publish Date - 2021-09-19T05:07:54+05:30

కొవిడ్‌ ప్రభావంతో మూతపడిన పాఠశాలలు ఇటీవలే తెరుచుకున్నాయి. నిబంధనలు పాటిస్తూనే తరగతులు సాగుతున్నాయి. బాలల ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికల అనారోగ్య సమస్యలు గుర్తించి వైద్య సేవలు అందించేందుకు బాల సురక్షను ప్రభుత్వం గతంలో రూపొందించింది.

గతంలో వినియోగించిన బాల సురక్ష వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెండేళ్లుగా ఆగిన సేవలు

గతంలో వందలాది మంది పిల్లలకు స్ర్కీనింగ్‌ పరీక్షలు

అమలు చేయాలని తల్లిదండ్రుల విన్నపాలు

(కొమరాడ)

కొవిడ్‌ ప్రభావంతో మూతపడిన పాఠశాలలు ఇటీవలే తెరుచుకున్నాయి. నిబంధనలు పాటిస్తూనే తరగతులు సాగుతున్నాయి. బాలల ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికల అనారోగ్య సమస్యలు గుర్తించి వైద్య సేవలు అందించేందుకు బాల సురక్షను ప్రభుత్వం గతంలో రూపొందించింది. కరోనాతో రెండేళ్ల నుంచి సేవలు నిలిచిపోయాయి. 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా గత నెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఆగిన బాల సురక్ష సేవలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈసేవలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

23 బృందాలు

గతంలో జిల్లా వ్యాప్తంగా 23 వాహనాలలో 23 బృందాలు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి శస్త్ర చికిత్సలకు సిఫారసు చేసేవారు. స్ర్కీనింగ్‌ పరీక్షలో గుర్తించిన లోపాలకు వైద్య సేవలందించేందుకు ప్రాంతీయ ఆసుపత్రుల్లో సత్వర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనాతో రెండేళ్లుగా బాల సురక్ష ప్రక్రియ ఆగిపోవడంతో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు వైద్య సేవలు అందని ద్రాక్షలా మారాయి.

కొవిడ్‌ కాలంలో కీలకం

 కొవిడ్‌ కాలంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకం మళ్లీ ప్రారంభిస్తే చిన్నారుల్లో లోపాలు గుర్తించి అవసరమైన వైద్య చికిత్సను త్వరగా అందించే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లుగా చిన్నారుల్లో మానసిక సమస్యలు, పౌష్టికాహార లోపాలు బాగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో బాల సురక్ష సిబ్బందిని అందుబాటులో ఉంచితే లోపాలను త్వరగా గుర్తించే వీలుంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలను కూడా త్వరగా గుర్తిస్తేనే వాటికి తేలికగా వైద్యం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయమై కొమరాడ పీహెచ్‌సీ వైద్యులు అనిల్‌ వద్ద ప్రస్తావించగా ప్రస్తుతానికి ఈ పథకం పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు.


Updated Date - 2021-09-19T05:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising