ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలో వదంతులు నమ్మొద్దు

ABN, First Publish Date - 2021-05-09T05:12:00+05:30

సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను కొవిడ్‌ బాధితులు నమ్మొద్దని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. అనవసర సందేశాలను నమ్మి ఆందోళన చెందొద్దని, ప్రశాంత వాతా వరణంలో ఉండాలని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం

   కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ వెల్లడి

కలెక్టరేట్‌, మే 8 : సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను కొవిడ్‌ బాధితులు నమ్మొద్దని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ శనివారం ఓ ప్రకటనలో సూచించారు. అనవసర సందేశాలను నమ్మి ఆందోళన చెందొద్దని, ప్రశాంత వాతా వరణంలో ఉండాలని తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురికారాదన్నారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని  చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.   ప్రస్తుతం వారికి మూడు పద్ధతుల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. హోంఐసోలేషన్‌లో ఉన్నవారికి ఫోన్‌  లేదా ఆరోగ్య కార్యకర్తల ద్వారా కిట్లు అందించి తగిన వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్ద ఉండేందుకు తగిన వసతులు లేనివారికి కొవిడ్‌ కేర్‌ సెం టర్లు ఏర్పాటు చేశామని  వెల్లడించారు.  తీవ్ర  ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నామన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో  రెమ్‌ డెసివిర్‌, ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.

 

Updated Date - 2021-05-09T05:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising