ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభిన్న ‘ప్రతిభ’!

ABN, First Publish Date - 2021-12-04T04:10:00+05:30

‘వైకల్యం వారిలో ఉన్న క్రీడా నైపుణ్యానికి అడ్డురాలేదు. దివ్యాంగులమన్న దిగులు లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటారు. తమ ఆట శైలితో ఆ ప్రాంగణానికే వన్నె తెచ్చారు’.. విజయనగరంలో రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీ శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వీల్‌చైర్ల సాయంతో దివ్యాంగులు చాటిన క్రీడా నైపుణ్యం అబ్బురపరచింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయనగరం

ఉత్సాహభరితంగా మ్యాచ్‌ జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉత్సాహభరితంగా దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీ
విజేతగా నిలిచిన ఆంధ్రా టైగర్స్‌ జట్టు
 దాసన్నపేట, డిసెంబరు 3: 
‘వైకల్యం వారిలో ఉన్న క్రీడా నైపుణ్యానికి అడ్డురాలేదు. దివ్యాంగులమన్న దిగులు లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటారు. తమ ఆట శైలితో ఆ ప్రాంగణానికే వన్నె తెచ్చారు’.. విజయనగరంలో రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రికెట్‌ టోర్నీ శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వీల్‌చైర్ల సాయంతో దివ్యాంగులు చాటిన క్రీడా నైపుణ్యం అబ్బురపరచింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయనగరం యూత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టోర్నీ నిర్వహించారు. గాజులరేగలోని సీతం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం దీనికి వేదికైంది.  రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఉత్సాహంగా  మ్యాచ్‌లు జరిగాయి. ఆంధ్రా టైగర్స్‌ టీం విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.  మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా కెప్టెన్‌ అప్పలరాజు నిలిచారు. 15 ఓవర్లలో ఆంధ్రాటైగర్స్‌ 114 పరుగులు చేసి చండీఘర్స్‌ లైన్స్‌కి సవాల్‌ విసిరింది. చండీఘర్‌ లైన్స్‌ 85 పరుగులకే కుప్పకూలిపోయింది. విజేతలకు సీతం కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గురాన అయ్యలు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ బహుమతులు ప్రదానం చేశారు.  యూత్‌ ఫౌండేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఇల్తామస్‌, అంబులెన్స్‌ శివ, సంస్థ ప్రతినిధులు అనిల్‌కుమార్‌, అశోక్‌, సమీర్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T04:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising