ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు వేయకుండా చేశారు..

ABN, First Publish Date - 2021-03-09T05:01:14+05:30

పార్వతీపురం పట్టణంలోని 29వ వార్డులో ఇద్దరు అభ్యర్థులు అకస్మాత్తుగా పోటీ నుంచి విరమించుకొని తమను ఓటేయకుండా మోసం చేశారంటూ ఆ వార్డు ప్రజలు కొంతమంది స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు.

పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న 29వ వార్డు ఓటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నామినేషన్‌ ఉపసంహరణపై ఓటర్లు నిరసన

పార్వతీపురం టౌన్‌, మార్చి 8: పార్వతీపురం పట్టణంలోని 29వ వార్డులో ఇద్దరు అభ్యర్థులు అకస్మాత్తుగా పోటీ నుంచి విరమించుకొని తమను ఓటేయకుండా మోసం చేశారంటూ ఆ వార్డు ప్రజలు కొంతమంది స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఇండిపెండింట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని గుడుపూరు ఈశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని పండా మురళీలు  నామినేషన్‌ వేశారని, వారు బరిలో ఉండడం వల్ల కొందరు విద్యావంతులను పోటీ చేయకుండా ఆపామని విన్నవించారు. తమకు తెలియకుండా పోటీ నుంచి విరమించుకున్నారని, వార్డు వైసీపీకి ఏకగ్రీవం కావడంతో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని వాపోయారు. డబ్బు తీసుకొని పోటీ నుంచి తప్పుకొని తమను మోసం చేశారని, ఇదంతా ప్రణాళిక ప్రకారం చేశారని ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పట్టణ పోలీసు స్టేషన్‌తోపాటు మున్సిపల్‌ సహాయ ఎన్నికల అధికారి కనక మహాలక్ష్మీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-03-09T05:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising