ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును నిర్బంధించడం తగదు

ABN, First Publish Date - 2021-03-02T05:50:25+05:30

రేణిగుంట విమానాశ్రయంలో మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అక్రమం గా నిర్బంధించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్వతీపురం పట్టణంలో సోమవారం నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేతను అట్డుకోవడంపై పార్టీ శ్రేణుల నిరసన

పార్వతీపురం, మార్చి1: రేణిగుంట విమానాశ్రయంలో మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును అక్రమం గా నిర్బంధించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్వతీపురం పట్టణంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో తిరుపతిలో నిరసన కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబును అక్రమంగా విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి ప్రజలను కలిసే స్వేచ్ఛ లేదా.. అని వారిరువు రు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు,  పాల్గొన్నారు.  


చీపురుపల్లి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని స్థానిక పార్టీ నాయ కులు వ్యతిరేకించారు. పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు రౌతు కామునాయుడు నేతృ త్వంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గవిడి నాగరాజు తదితరులు నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరతి సాహు, సబ్బి సోనియా, గడే సన్యాసప్పలనాయుడు, లెంక చిన్నారావు, బుంగ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-02T05:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising