ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో కరోనా విజృంభణ

ABN, First Publish Date - 2021-05-17T04:55:55+05:30

మామిడిపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామం గుడ్డంగివానివలసలో కరోనా కోరలు చాచింది. ఈ గ్రామంలో 32 కుటుంబాలుండగా వారిలో 37 మందిని కరోనా బాధితులుగా గుర్తించారు. గ్రామంలో 32 ఇళ్లలో 124 మంది నివశిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలో 67 మందికి కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.

జాగ్రత్తలను వివరిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన పల్లెలో 32 ఇళ్లకు 37 మందికి కరోనా

సాలూరు రూరల్‌, మే 16: మామిడిపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న చిన్న గిరిజన గ్రామం గుడ్డంగివానివలసలో కరోనా కోరలు చాచింది. ఈ గ్రామంలో 32 కుటుంబాలుండగా వారిలో 37 మందిని కరోనా బాధితులుగా గుర్తించారు. గ్రామంలో 32 ఇళ్లలో 124 మంది నివశిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలో 67 మందికి  కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో తొలుత 31 మంది బాధితులుగా గుర్తించారు. మళ్లీ మరో 15 మందికి  పరీక్షలను నిర్వహించగా మరో ఆరుగురు కరోనా బాధితులుగా గుర్తించారు. చిన్న గ్రామంలో ఏకంగా 37 మంది బాధితులుండడంతో మండలంలో ఈ సమాచారం సంచలనమైంది. బాధితుల్లో 33 మందిని మూడు 108 వాహనాల్లో రెండు దఫాలుగా బొబ్బిలి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ఆదివారం తరలించారు. మరో ముగ్గురు ఇంటి వద్ద చికిత్సకు అనుమతించారు. ఒక బాధితుడు మాత్రం తెల్లవారుజాము నుంచి ఆచూకీ లభించకపోవడంతో అతని గురించి వైద్యసిబ్బంది ఆరా తీస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినట్టు ఈవోపీఆర్డీ కె.కుమార్‌వర్మ చెప్పారు. సాలూరు రూరల్‌ పోలీసులు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  


Updated Date - 2021-05-17T04:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising