ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా’565

ABN, First Publish Date - 2021-04-22T05:14:48+05:30

కరోనా...జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో భాగంగా బుధవారం గరిష్ట స్థాయిలో కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 565 కేసులు నమోదు కావడం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  భారీగా కేసులు నమోదు

  భయాందోళనలో ప్రజలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

 కరోనా...జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌లో భాగంగా బుధవారం గరిష్ట స్థాయిలో కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 565 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రంలోనే గరిష్ట స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 1,444 కేసులు నమోదై... రాష్ట్ర మొత్తం శ్రీకాకుళం వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. మన పక్కనే ఉన్న మరో జిల్లా విశాఖలో 810 కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి పక్క జిల్లాలకు సైతం ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఏమాత్రం కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడం లేదు. కొంతమంది మాస్కులు వేసుకోకుండా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీలో మచ్చుకైనా శానిటైజేషన్‌ కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో ఆర్టీసీలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇదిలా ఉండగా సెకండ్‌వేవ్‌లో కరోనా వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా మరణాలు నమోదు కావడం గమనార్హం. గతంలో 50 ఏళ్లు దాటిన వారికి ఎక్కువ ప్రమాదకరంగా ఉండేది. కానీ సెకండ్‌ వేవ్‌లో యువత కూడా మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఏదో ఒక మండలంలో నిత్యం మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య శాఖ మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తోందనే వాదన ఉంది. ఇదిలా ఉండగా.. మొదట్లో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న వారు సైతం ఇప్పుడు అటువైపు చూస్తున్నారు.  ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ వేయించుకుంటున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మమ్మరంగా చేపట్టాలని వైద్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కోవాక్సిన్‌, కోవిషీల్డ్‌ రెండు రకాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రమణకుమారి వెల్లడించారు. 69 కేంద్రాల్లో కోవిషీల్డ్‌ ఇవ్వనున్నారు. 18 కేంద్రాల్లో కోవాక్సిన్‌, కోవిషీల్డ్‌ రెండు వ్యాక్సిన్లూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. గురువారం నుంచి రెండో డోసు కూడా వేయనున్నట్టు వెల్లడించారు. రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిన వారు సంబంధిత కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు.

 

Updated Date - 2021-04-22T05:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising