ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ఫ్యూకు సహకరించండి : ఎస్పీ

ABN, First Publish Date - 2021-06-13T05:17:47+05:30

జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ రాజకుమారి కోరారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను ప్రశ్నిస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం క్రైం, జూన్‌ 12: జిల్లాలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలకు ప్రజలు సహకరించాలని  ఎస్పీ రాజకుమారి కోరారు. శనివారం నగరంలోని  గంటస్తంభం, రింగురోడ్డు, అంబేడ్కర్‌ జంక్షన్‌, ఎత్తుబ్రిడ్జి, కలెక్టరేట్‌ జంక్షన్‌ ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి కారణాలు తెలపకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులను ఆపి జరిమానా విధించాలని,  వాహనాలను సీజ్‌ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని, ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని చెప్పారు.   ట్రాఫిక్‌ సీఐ మోహనరావు, సీఐ మురళీ తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-06-13T05:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising