ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం ఎత్తు తగ్గించేందుకు కుట్ర

ABN, First Publish Date - 2021-03-01T04:55:22+05:30

పోలవరం ఎత్తు తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చీపురుపల్లి, ఫిబ్రవరి 28: పోలవరం ఎత్తు తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. ఆదివారం ఆయన   స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించాలని , నిర్వాసితులకు కూడా అన్యాయం చేయడానికి చూస్తున్నారని  ఆరోపించారు. ఆమోదించిన డిజైన్‌ మేరకే పనులు పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెబుతున్నా సీఎం జగన్‌  చెవికెక్కించుకోవడం లేదన్నారు. ఎత్తు తగ్గించి 1.07 లక్షల కుంటుంబాలకిచ్చే పరిహారాన్ని కేవలం 45 వేల కుటుంబాలకివ్వాలని యోచిస్తున్నారన్నారు. తద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.55 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు కుదించాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని  తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుగా  కూడా  తప్పుడు ఆలోచనలకు సాయపడుతున్నారన్నారు. ఈ విషయంలో సీఎం పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగితే టీడీపీ చూస్తూ ఊరుకోదన్నారు

 

Updated Date - 2021-03-01T04:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising