ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే విమానాశ్రయానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2021-10-15T05:25:50+05:30

అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు 99శాతం భూసేకరణ పూర్తయిందని... త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని జేసీ కిషోర్‌కుమార్‌ చెప్పారు.

ఎయిర్‌పోర్టు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  99 శాతం భూసేకరణ పూర్తి

  నిర్వాసితుల ఇళ్లకు భూమి పూజ చేసిన జేసీ కిషోర్‌కుమార్‌

భోగాపురం, అక్టోబరు14: అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు 99శాతం భూసేకరణ పూర్తయిందని... త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని జేసీ కిషోర్‌కుమార్‌ చెప్పారు. గూడెపువలసలో నిర్వాసితుల కోసం చేపట్టిన గృహనిర్మా ణాలకు ఆయన గురువారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ విమానా శ్రయం ఏర్పాటుతో పాటు ఇతర అవసరాలకు 2,900 ఎకరాలు కావాలని అన్నారు. భూసేకరణ 99శాతం పూర్తయిందని తెలిపారు. రెల్లిపేట, బొల్లింకలపాలెం, ముడ సర్లపేట, మరాడపాలెం గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు గూడెపువలస, పోలిపల్లి సమీపంలో అన్ని వసతులతో ప్రైవేటు లేఅవుట్‌కు దీటుగా స్థలాలు అభివృద్ధి చేశా మన్నారు. రహదారులు, కాలువలు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకు న్నామని చెప్పారు. అభివృద్ధి చేసిన స్థలాల్లో 376 కుటుంబాలకు 5సెంట్లు చొప్పున కేటాయిస్తూ... ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సుమారు రూ.9లక్షల20వేలు అందజే యనున్నామన్నారు. గతంలో తామే గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. నచ్చిన విధంగా నిర్మించుకొంటామని నిర్వాసితులు చెప్పడంతో వారి కోరిక ప్రకారమే గృహాలు నిర్మించుకోమన్నామని చెప్పారు. శంకుస్థాపన కోసం ముం దుగా రూ.50వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఎయిర్‌పోర్టు శంకు స్థాపన కూడా త్వరలోనే చేపట్టడానికి సన్నాహాలు చేస్తామని తెలిపారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో భవానీశంకర్‌, ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ అధికారి పి.రామ్మోహనరావు, తహసీల్దార్‌ ఎం.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-10-15T05:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising