ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటికి రండి.. చక్కగా చూసుకుంటా!

ABN, First Publish Date - 2021-07-24T05:03:41+05:30

ఉన్నత భవిష్యత్‌ ఉన్న విద్యార్థులు ఇలా రహదారులపై పడుకోరాదని, తన ఇంటికి వస్తే భోజనం పెట్టి చక్కగా చూసుకుంటామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విద్యార్థులు రహదారిపై నిద్ర చేయకూడదు  

 ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకెళ్తా: కలెక్టర్‌

 కలెక్టరేట్‌, జూలై 23: ఉన్నత భవిష్యత్‌ ఉన్న విద్యార్థులు ఇలా రహదారులపై పడుకోరాదని,  తన ఇంటికి వస్తే భోజనం పెట్టి  చక్కగా చూసుకుంటామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. జిల్లాలో సంక్షేమ వసతి గృహా లను తెరిపించాలని విద్యార్థి సంఘం నాయకులు  నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి  సమయంలో పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించి విడిచిపెట్టారు.  కాగా శుక్రవారం దీక్షను తిరిగి  కొనసాగించారు. మధ్యా హ్నం ఒంటి గంట సమయంలో  విద్యార్థి సంఘ నాయ కులు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా తగ్గుముఖం పడు తున్న సమయంలో విద్యార్థులు బయట తిరగ కూడదని సూచించారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కారం చేయా ల్సి ఉందని తెలిపారు. విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఫోన్‌లో సూచించారు. 

ఒలింపిక్స్‌ బృందానికి శుభాకాంక్షలు 

   టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ తరఫున వివిధ ఈవెంటల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ శుభాకాంక్షలు తెలిపారు.  క్రీడాకారులంతా విజయం సాధించి దేశానికి పతకాలు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్‌ సంఘం అందించిన జెర్సీని కలెక్టర్‌ ధరించి క్యాంపు కార్యాలయంలో చీర్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


 

Updated Date - 2021-07-24T05:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising