ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లలోనే శంబర పండుగ చేసుకోండి

ABN, First Publish Date - 2021-01-21T06:17:36+05:30

శంబర పండగను గ్రామస్థులు ఇళ్లలోనే జరుపుకోవాలని పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌ సూచించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మాట్లాడుతున్న డీఎస్పీ సుభాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు

పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌  

సాలూరు రూరల్‌/ మక్కువ, జనవరి 20: శంబర పండగను గ్రామస్థులు ఇళ్లలోనే జరుపుకోవాలని పార్వతీపురం డీఎస్పీ సుభాష్‌ సూచించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శంబర జాతరలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. శంబర వాసులు బంధుమిత్రులను ఆహ్వానించకపోవడమే మంచిదన్నారు. ఇళ్లలోనే అమ్మవారిని కొలుచుకోవాలని కోరారు. అమ్మవారి సిరిమానోత్సవం తదితర కార్యక్రమాలు ఉన్నతాధికారుల సూచన, ఆదేశాల మేరకు నిర్వహిస్తామని చెప్పారు.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పట్టణంలోని కల్యాణ వేంకటేశ్వర, కామాక్షి, అయ్యప్ప, పంచముఖేశ్వర,  సంతోషిమాత, సరస్వతి, వీరబ్రహ్మేంద్ర స్వామి, అయ్యప్ప తదితర ఆలయాలను పోలీస్‌ సిబ్బందితో సహా వెళ్లి సందర్శించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. సాలూరు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు ఫకృద్ధీన్‌, దినకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 జాతరకు చురుగ్గా ఏర్పాట్లు

  శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు నాలుగు రోజులే సమయం ఉండడంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ నెల 25న తొలేళ్ల ఉత్సవం ప్రారంభం కానుండడంతో పనులు జోరందుకున్నాయి. చదురుగుడి, వనంగుడి ఆవరణల్లో క్యూలైన్ల ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూల వద్ద పంకాలను అమర్చుతున్నారు. సిరిమానోత్సవాన్ని భక్తులు సౌకర్యంగా తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రత్యేక దర్శనాలకు వీలు కల్పిస్తున్నారు. చదురుగుడి, వనంగుడి ఆవరణల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు ప్రత్యేక గదులు సిద్ధం చేస్తున్నారు. గిరిజన సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రసాదాలు తయారు చేయనున్నారు. 



Updated Date - 2021-01-21T06:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising