ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా కోసం బారులు

ABN, First Publish Date - 2021-05-09T04:53:06+05:30

టీకా కోసం సంబంధిత కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు ఉదయాన్నే పరుగులు పెడుతున్నారు. కరోనా నుంచి రక్షణ కోసం ప్రయాస పడుతున్నప్పటికీ అక్కడ పరిస్థితులు వైరస్‌ ప్రబలే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. భారీ క్యూలో నిల్చొంటున్న ప్రజలు భౌతికదూరం పాటించడం లేదు. రాజీవ్‌నగర్‌ సీహెచ్‌సీ వద్ద శనివారం ఇలాంటి పరిస్థితే కనిపించింది.

రాజీవ్‌నగర్‌ సీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ కోసం బారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్రాల వద్ద గుంపులుగా ప్రజలు
విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ సీతానగరం(బొబ్బిలి), మే8 : టీకా కోసం సంబంధిత కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు ఉదయాన్నే పరుగులు పెడుతున్నారు. కరోనా నుంచి రక్షణ కోసం ప్రయాస పడుతున్నప్పటికీ అక్కడ పరిస్థితులు వైరస్‌ ప్రబలే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. భారీ క్యూలో నిల్చొంటున్న ప్రజలు భౌతికదూరం పాటించడం లేదు. రాజీవ్‌నగర్‌ సీహెచ్‌సీ వద్ద శనివారం ఇలాంటి పరిస్థితే కనిపించింది. టీకా కోసం బారులుతీరారు. ఒక్కోచోట టీకా టోకెన్‌ కోసం గుంపులుగా ఎగబడుతున్నారు. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే ఎంత మందికి వ్యాప్తి చెందుతుందో తెలియదు. ఇంకోవైపు టీకా కోసం కొన్ని గంటల పాటు నిరీక్షించినా దొరకడం లేదు. జిల్లాకు చేరుతున్న నిల్వలు అందరికీ సరిపోవడం లేదు. ప్రతిరోజూ చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉండగా నాయకుల సిఫారుసులతో కొందరికి ముందుగానే టోకెన్‌లు పంచేస్తున్నారని, క్యూలో నిల్చున్నవారికి దక్కడం లేదన్న ఆరోపణ ఉంది. జిల్లాలో ఇంకా 45 నుంచి 60 మధ్య వయసు వారిలో 16, 99, 230 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీఎంహెచ్‌వో రమణకుమారి తెలిపారు. ఇప్పటివరకు మొదటి డోస్‌ 2,53, 956 మంది వేశామని, సెకెండ్‌ డోస్‌ 95,635 మంది వేశామని వివరించారు. ఎప్పటికప్పుడు టీకా నిల్వలు జిల్లాకు చేరిన వెంటనే వాటిని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. 
బొబ్బిలిలో..
రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కోసం బొబ్బిలి పట్టణవాసులు ఆసుపత్రుల ఎదుట భారీగా క్యూ కడుతున్నారు. టీకాల కొరత వేధిస్తుండడంతో కొవిడ్‌ నిబంధనలు మరిచి బారులు దీరుతున్నారు.  కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో శనివారం కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం.  టీకా కోసం ఎగబడిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాయాతన పడ్డారు. 


Updated Date - 2021-05-09T04:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising