ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు బంద్‌

ABN, First Publish Date - 2021-03-05T05:27:28+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌లో సీపీఎం, సీపీఐ, తెలుగుదేశంతో పాటు అన్ని ట్రేడ్‌ యూనియన్లు పాల్గొననున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం పార్టీలు, సంఘాల పిలుపు

మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

రింగురోడ్డు, మార్చి4: 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌లో సీపీఎం, సీపీఐ, తెలుగుదేశంతో పాటు అన్ని ట్రేడ్‌ యూనియన్లు పాల్గొననున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వానికి చెందిన  సంస్థలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, టెలికాం కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేయాలని భావిస్తున్నాయి. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు రవాణా, సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని నాని శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపేస్తున్నామని ప్రకటించారు. 1 గంట తరువాత యథావిధిగా ఆర్టీసీ సర్వీసులు తిరుగుతాయని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ అప్పన్న తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది కూడా విధులకు నల్లబ్యాడ్జీలను ధరించి హాజరుకానున్నారు. బంద్‌లో శ్రేణులంతా పాల్గొనాలని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-03-05T05:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising