ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాస్త జ్ఞానాన్ని పెంచుకో.. విజయసాయికి అశోక్‌ కౌంటర్

ABN, First Publish Date - 2021-06-18T23:43:59+05:30

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని సూచించారు. నెల్లిమర్లలో ఆలయాన్ని శుక్రవారం దర్శించిన అనంతరం మీడియాతో అశోక్ గజపతి మాట్లాడుతూ.. ఆయన్ను హత్య చేయటానికి సిద్ధపడ్డానని తనపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హిందూమతంపై దాడులను నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. రామతీర్థం విగ్రహ విధ్వంసకులను పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలని కోరారు. రాముడి విగ్రహం శిరస్సు తొలగించినవారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. చీకటి జీవోలతో తనను తొలగించిన ప్రభుత్వానిదే తప్పు.. అమలుచేసిన అధికారులది, సిబ్బంది తప్పు లేనే లేదన ఆయన అన్నారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతిని ప్రభుత్వం మానుకోవాలని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-06-18T23:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising