ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగతనం కేసులో ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2021-12-01T05:24:24+05:30

డెంకాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈనెల 27న జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రూ.లక్షతోపాటు బంగారు ఆభరణాలు స్వాధీనం

విజయనగరం క్రైం/ డెంకాడ: డెంకాడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈనెల 27న జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళ వారం విజయనగరం సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో వెల్లడించారు. డెంకాడ మండలం అక్కివరం గ్రామానికి చెందిన నడిపిల్లి రాజినాయుడు ఇంట్లో నవంబరు 27న రూ.లక్ష నగదుతోపాటు ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీనిపై డెంకాడ ఎస్‌ఐ పద్మావతి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజినాయుడు ఇంటి సమీపంలో నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులపై అనుమానంతో వారి నుంచి వేలిముద్రలు సేకరించారు. ఈక్రమంలో విశాఖపట్నం అబుల్‌ఘడ్‌కు చెందిన సెంట్రీ కార్మికుడు మల్లె సూరిబాబును అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. కాగా సూరిబాబుపై గతంలో విశాఖ త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ... బెయిల్‌పై వచ్చాడు. సెంట్రీ పనుల కోసం అక్కివరం గ్రామానికి వచ్చి ఈ నేరాని కి పాల్పడ్డాడు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకుని, అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ పద్మావతి, పీసీలు కిరణ్‌, రామరాజులను డీఎస్పీ అభినందించారు.  

 

Updated Date - 2021-12-01T05:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising