మాన్సాస్‌లో మరో మలుపు
ABN, First Publish Date - 2021-08-10T05:09:11+05:30
మాన్సాస్ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించాలని ఆనందగజపతి రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతిరాజు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సోమవారం పిటిషన్ వేశారు. దీంతో ఇదో మలుపుగా భావిస్తున్నారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. చైర్మన్ పదవి కోసం ముక్కోణ పోటీ ప్రారంభమైంది.
చైర్మన్ పదవికి ముక్కోణ పోటీ
చైర్‌పర్సన్‌గా అవకాశమివ్వాలని హైకోర్టుకు వెళ్లిన ఊర్మిళ
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
మాన్సాస్ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించాలని ఆనందగజపతి రెండో భార్య కుమార్తె ఊర్మిళా గజపతిరాజు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సోమవారం పిటిషన్ వేశారు. దీంతో ఇదో మలుపుగా భావిస్తున్నారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. చైర్మన్ పదవి కోసం ముక్కోణ పోటీ ప్రారంభమైంది. ఇప్పటికే చైర్మన్ పదవి కేసు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఉంది. ఆనంద్ గజపతి మొదటి భార్య కుమార్తె సంచయితను మాన్సాస్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన జీవోను సింగిల్ బెంచ్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ కేసు డివిజన్ బెంచ్‌లో నడుస్తుండగానే తాజాగా ఆనంద్ రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేయడంతో మాన్సాస్ కథ మరో మలుపు తిరుగుతోంది. ఈ పిటిషన్‌పై డివిజన్ బెంచ్ మంగళవారం స్పష్టత ఇవ్వనుంది. ఇంతవరకు సంచయితను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఊర్మిళ గజపతి పోరాటం సాగిస్తున్నారు. ఇప్పుడు తనకే చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
Updated Date - 2021-08-10T05:09:11+05:30 IST