ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2021-11-30T05:04:27+05:30

విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ నాయకత్వ లక్ష ణాలు అలవర్చుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట:  విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ నాయకత్వ లక్ష ణాలు అలవర్చుకోవాలని  మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని ఆనందగజపతి ఆడిటోరి యంలో ఎస్‌ఎఫ్‌ఐరాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుండగా రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ..విద్యార్థుల సమస్యలు, విద్యా సంస్థల్లో ఎదురవుతున్న ఇబ్బం దులను సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యార్థి దశలో విద్యార్థి సంఘ నాయ కుడిగా తానుండబట్టే నేడు ఈ స్థాయికి ఎదిగానన్నారు. అమ్మఒడి  వంద శాతం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన విద్యా విధా నం ద్వారా కొన్ని మార్పులు చేస్తున్నామని, పాఠశాలల విలీనం వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంగ్లిషు విద్య అనేది చాలా అవసర మన్నారు. ఆంగ్లం  రాకపోవడం వల్ల ఎంపీగా చేసినప్పుడు ఢిల్లీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తెలుగుభాష తల్లిలాంటిదని, ఉపాధి అవకాశాల కోసం ఇంగ్లిషు  భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిం చారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ  రఘురాజు, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు అశోక్‌, రామ్మోహన్‌, సురేష్‌, సానూ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-11-30T05:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising